ముత్తుకూరు, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ శనివారం కృష్ణపట్నం కేంద్రంగా జరిగింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మండల తెలుగు యువత కమిటీ అధ్యక్షుడు రాగాల శివకృష్ణ విగ్రహ దాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు