Kaizer News

ఫైనాన్స్‌ కంపెనీల ఒత్తిడి.. ఆటోడ్రైవర్‌ మృతి

ఫైనాన్స్‌ కంపెనీల ఒత్తిడి.. ఆటోడ్రైవర్‌ మృతి

· State - Telangana · ntnews.com

ములుగు జిల్లాలో విషాదం తాడ్వాయి, సెప్టెంబర్‌19 : ఫైనాన్స్‌ కంపెనీల ఒత్తిడిని తట్టుకోలేక ఆటో డ్రైవర్‌ గుండెపోటుతో మృతి చెందిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరిగింది. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్లాపురం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ సుతారపు దామోదర్‌ (24) కొన్నేండ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. ఫైనాన్స్‌లో ఆటో తీసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఉచిత బస్సు పథకంతో ఆటోకు గిరాకీ లేకుండా పోవడంతో దామోదర్‌ ఈఎంఐలు కట్టలేకపోయాడు. వాయిదాలు చెల్లించాలని ఫైనాన్స్‌ కంపెనీలు ఒత్తిడి చేయడంతో శుక్రవారం దామోదర్‌ గుండెపోటుకు గురై మృతి చెందాడు

Original source: ntnews.com
Read more on Kaizer News