మంచిర్యాలటౌన్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలికల క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి క్రికెట్ అపరేషన్ కమిటీ సెలక్టర్లు జి.రవికుమార్‌రెడ్డి, చీఫ్ కోఆర్డినేటర్ ఎం.రేవతి హాజరై పోటీలను నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి 50 మంది బాలికలు హాజరయ్యారు. వివిధ వయసుల వారీగా ఆడించి, అందులో ప్రతిభను కనబర్చినవారిని ఎంపిక చేశారు. వీరికి హైదరాబాద్‌లో జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ కార్యదర్శి కోదాటి ప్రదీప్, సీనియర్ కోచ్ పోరండ్ల ప్రదీప్, మేనేజర్ కోలి వేణుమాధవ్, సీనియర్ క్రీడాకారుడు చందు తిరుపతి పాల్గొన్నారు. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు