Kaizer News

Atmakuru: ఘనంగా టీడీపీ మండల స్థాయి సమావేశం

Atmakuru: ఘనంగా టీడీపీ మండల స్థాయి సమావేశం

· State - Telangana · hmtvlive.com

Shorts ఆత్మకూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో ఆత్మకూరు రూరల్ మండలానికి సంబంధించిన మండల స్థాయి టీడీపీ సమావేశం నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షులు సుంకర పెంచల చౌదరి,నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు కేతా విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రామ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై విస్తృతంగా చర్చించారు. గ్రామాల్లోని సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పార్టీ శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సమావేశంలో సూచించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ కో-కన్వీనర్ చండ్ర మల్లికార్జున నాయుడు, మండల యూనిట్ ఇన్‌చార్జ్‌లు కొండ్రెడ్డి రమణారెడ్డి, కొప్పోలు విజయభాస్కర్ రెడ్డి, TNSF నియోజకవర్గ అధ్యక్షులు షేక్ హుస్సేన్, నువ్వూరుపాడు గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ ఖాజావలి, బూత్ కన్వీనర్ షేక్ రియాజ్, అప్పారావుపాలెం టీడీపీ సీనియర్ నాయకులు నావినేని పెంచల నాయుడు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News