Kaizer News

Gokavaram: గోకవరం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ

Gokavaram: గోకవరం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

· State - Telangana · hmtvlive.com

Shorts తూర్పుగోదావరి జిల్లా: గోకవరం మండల కేంద్రంలో ది గోకవరం ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా కొంగరపు రాజు, ప్రధాన కార్యదర్శిగా కర్రీ శివరామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మద్దాల రాంబాబు, వై.వి. సత్యనారాయణ, కోశాధికారిగా బత్తుల వీరభద్రరావు, సహాయ కార్యదర్శులుగా పెరవల్లి శ్యామలరావు, గుల్లంపూడి ఆనంద్ ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా కింతాడ సిద్ధు రాజు, జాజుల సత్తిబాబు, కో-ఆప్షన్ సభ్యుడిగా షేక్ గని, లీగల్ అడ్వైజర్‌గా కోన శ్రీనివాసు, పిఆర్వోలుగా కంచుమర్తి రాజశేఖర్, ఇజ్జిన కిరణ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కొంగరపు రాజు మాట్లాడుతూ.. పాత్రికేయ వృత్తిలో ప్రజల పక్షాన నిలిచి, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేశానని తెలిపారు. తనను ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, సభ్యుల సమస్యలను స్థానిక జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. సభ్యుల సంక్షేమంతో పాటు ప్రెస్ క్లబ్ అభివృద్ధికి నూతన కార్యవర్గం సమష్టిగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు, నూతన కార్యవర్గ సభ్యులు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News