Shorts మద్నూర్ (కామారెడ్డి ): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల మాజీ ఎంపీపీ కీర్తిశేషులు ప్రజ్ఞకుమార్ కుటుంబాన్ని ఎంఆర్పీఎస్ జుక్కల్ నియోజకవర్గ నాయకులు పరామర్శించారు. జుక్కల్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు సూర్యావంశీ యాదవ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు వారి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజ్ఞకుమార్ ఎంపీపీగా ఉన్న సమయంలో మద్నూర్ మండల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని గుర్తు చేశారు. దళితుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన సేవలు ఎప్పటికీ మరువలేనివని కొనియాడారు. ఆయన మృతి దళిత సమాజానికి, జుక్కల్ నియోజకవర్గానికి తీరని లోటని అన్నారు.ప్రజ్ఞకుమార్ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వారి పిల్లల ఉన్నత విద్యాభ్యాసానికి ఎంఆర్పీఎస్ పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని సూర్యావంశీ యాదవ్ భరోసా ఇచ్చారు. కుటుంబానికి అవసరమైన ప్రతి విషయంలో తమ సంఘం తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. మద్నూర్ మండల మాజి ఎంపి పి, కీర్తి శేషులు ప్రజ్ఞ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఎం ఆర్ పి ఎస్ జుక్కల్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు సూర్యావంశీ యాదవ్ మాదిగ, గాయాక్వాడ్ విజయ్, బోడ్కె హన్మంత్, లచ్చన్ మరోతి, భీమ్ రావ్, లక్ష్మణ్, లింబుర్ యాదవ్,గౌలే శ్రీరంగ్, మిరే వార్ సాయిలు,శాంతపూర్ రవి లతోపాటు నియోజకవర్గ ఎం ఆర్ పి ఎస్ నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు