Kaizer News

ఆమనగల్లు: క్రషర్, మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని ధ

ఆమనగల్లు: క్రషర్, మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని ధర్నా

· State - Telangana · v6velugu.com

ఆమనగల్లు, వెలుగు : ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న క్రషర్, మైనింగ్ అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు శనివారం ఆమనగల్లులో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా 22 -ఏ లో ఉన్న ప్రభుత్వ భూమిని పట్టభూమిగా చూయించి, పంచాయతీ ఎన్ ఓసి తీసుకోకుండా సర్వేనెంబర్ 304 లో 4.86 హెక్టార్ల భూమి లీజుకు ఇవ్వడం అన్యాయమన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాట మాడే క్రషర్, మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నరేందర్ రెడ్డి, నాయకులు, యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు

Original source: v6velugu.com
Read more on Kaizer News