Bhimadevarapalli: “పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా ఆదివారం గొల్లపల్లి గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించి, గేదెలకు గర్భకోశ వ్యాధుల నివారణ మందులు వేశారు. అనంతరం ప్రజల సమక్షంలో అధికారులతో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల నుంచి వ్యక్తిగత, సామాజిక, మౌలిక వసతులకు సంబంధించిన వినతిపత్రాలను స్వీకరించిన మంత్రి, ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా పాలనలో గొల్లపల్లి గ్రామానికి జరిగిన అభివృద్ధి ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గొల్లపల్లి గ్రామంలో 3 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, మూడు ఇళ్లు పూర్తయ్యాయని, త్వరలో రెండో దశలో మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్నాయని మంత్రి తెలిపారు. గ్రామంలో 55 పెన్షన్లకు రూ.1.57 లక్షలు విడుదల అవుతున్నాయని, కొత్త పెన్షన్ల కోసం ఇప్పటివరకు 11 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరాతో 108 కుటుంబాలకు రూ.97,200 మేర లబ్ధి చేకూరిందన్నారు. మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ ద్వారా 74 కుటుంబాలకు రూ.51,174 విడుదల చేశామని తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల కింద 13 ఎస్‌హెచ్‌జీలకు రూ.5.75 లక్షలు, బ్యాంక్ లింకేజీ కింద 13 ఎస్‌హెచ్‌జీలకు రూ.3.15 కోట్ల రుణాలు అందించామని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు గ్రామంలోని మహిళా సంఘాల ద్వారా 300 స్టీల్ బ్యాంక్ కిట్లను, ఒక్కో కిట్‌లో 13 రకాల వస్తువులతో అందించామని తెలిపారు. 47 మంది రైతులకు రూ.51.18 లక్షల రైతు రుణమాఫీ, 255 మంది రైతులకు రైతు భరోసా కింద రూ.1.12 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. రైతు బీమా కింద ఒక రైతు కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందించామని, సన్న వడ్ల బోనస్ కింద నలుగురు రైతులకు రూ.60 వేలు విడుదల చేశామని తెలిపారు. 16 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు, 200 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామని, రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. గ్రామంలో రూ.25 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల పనులు పూర్తి చేశామని, 145 మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు అందించామని, మిషన్ భగీరథ తాగునీటి సరఫరా కోసం రూ.3.5 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడం నా బాధ్యత. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి త్వరలోనే ప్రాజెక్టులో నీళ్లు నింపే బాధ్యత తనదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.. “గౌరవెల్లి కాలువల భూసేకరణకు ప్రభుత్వం పరిహారం అందిస్తుంది. సుప్రీంకోర్టులో ఉన్న కేసు కూడా కొట్టివేయబడింది. త్వరలోనే ప్రాజెక్టులో నీళ్లు నింపుతాం” అని మంత్రి తెలిపారు. గ్రామ సర్పంచ్ నేతుల చంద్రమోహన్, గ్రామ ప్రజలు ప్రస్తావించిన సమస్యలపై మంత్రి స్పందిస్తూ: గొల్లపల్లి బస్ స్టేషన్ నుంచి ముత్తారం–గట్ల నర్సింగాపూర్ వైపు రహదారి నిర్మాణానికి రూ.3.5 కోట్లతో ప్రతిపాదన పంపామని, త్వరలో మంజూరు చేస్తామని తెలిపారు. గొల్లప