Kaizer News

నాలుగు చోరీ కేసులను చేదించిన పొలీసులు

నాలుగు చోరీ కేసులను చేదించిన పొలీసులు

· State - Telangana · prabhanews.com

ముగ్గురు నింధితులు అరెస్ట్ 17 తులాల బంగారం, కేజిన్నర వెండి, రూ.4 లక్షలు స్వాదీన పలాస, ఆంధ్రప్రభ : కాశీబుగ్గ సబ్‌ డివిజన్‌ పరిధిలోని వజ్రపుకొత్తూరు, మెళియాపుట్టి, పాతపట్నం మండలాల్లో జరిగిన నాలుగు వేర్వేరు చోరీ కేసులను కాశీబుగ్గ పోలీసులు ఛేదించారు. ఈ కేసులకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి 17 తులాల బంగారం, కేజీన్నర వెండి, రూ.4 లక్షల నగదు, చోరీకి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్‌ ఎస్పీ (క్రైం) పి. శ్రీనివాసరావు వెల్లడించారు. గజపతి జిల్లా పర్ణాఖిమిడి కండ్రవీధికి చెందిన బెనియా దుర్గాప్రసాద్‌, టీటా మండల్‌కు చెందిన పొట్నూరు మిన్నారావుతో పాటు మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసులను కాశీబుగ్గ డీఎస్పీ టి. భవాని పర్యవేక్షించగా, కాశీబుగ్గ రూరల్‌ సీఐ తిరుపతిరావు, క్రైం టీమ్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రబౌళి, ఎస్‌ఐలు భరత్‌, కె. మధుసూదనరావు, క్రైం టీమ్‌ హెచ్‌సీ శ్రీను, పీసీలు మాధవ, హరీష్‌, ఆలీ, విజయలు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో కాశీబుగ్గ సీఐ జి. రామకృష్ణ పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News