ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. బ్యాంకింగ్ నుంచి షాపింగ్ వరకు దాదాపు అన్ని పనులు క్షణాల్లో పూర్తవుతున్నాయి. యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ పేమెంట్స్ వల్ల నగదు లావాదేవీలు సులభమయ్యాయి. రూపాయి చిల్లర లేదు అన్నా యూపీఐ చేస్తానని చెప్పే స్థాయికి నేడు డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. అయితే ఇదే సౌకర్యాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఓటీపీ చెప్పించడం నుంచి సిమ్ స్వాప్, స్క్రీన్ షేరింగ్, నకిలీ కస్టమర్ కేర్ పేరుతో మోసాలు చేయడం వరకు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. సైబర్ కేటుగాళ్లు ఎప్పటికప్పుడు తమ పాత పద్ధతులను వదిలించుకొని నూతన మార్గాలను వెతుకుతూ కస్టమర్ల సొమ్మును కాజేస్తున్నారు. బ్యాంకు అధికారులు, కస్టమర్ కేర్ సిబ్బంది పేరుతో ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు అడగడం సైబర్ మోసాల్లో సాధారణంగా మారింది. మీ ఖాతా బ్లాక్ అవుతుందని, కేవైసీ అప్‌డేట్ చేయాలని, క్రెడిట్ కార్డు రద్దవుతుందని చెప్పి భయపెడతారు. అనంతరం మొబైల్‌కు వచ్చిన ఓటీపీని చెప్పాలని కోరుతారు. ఒక్కసారి ఓటీపీని నేరగాళ్లకు వెల్లడిస్తే.. ఖాతా నుంచి నగదు బదిలీ అయ్యే ప్రమాదం ఉంటుంది. బ్యాంకులు సాధారణంగా ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్, కార్డు వివరాలను ఫోన్‌లో అడగవు. సిమ్ స్వాప్‌తో అసలు నంబర్ వాళ్ల చేతుల్లోకి.. సిమ్ స్వాప్ మరో ప్రమాదకరమైన పద్ధతి. బాధితుడి మొబైల్ నంబర్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించిన నేరగాళ్లు.. అదే నంబర్‌తో కొత్త సిమ్ పొందేందుకు ప్రయత్నిస్తారు. కొత్త సిమ్ యాక్టివేట్ అయితే అసలు వినియోగదారుడి ఫోన్‌కు కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు రావడం ఆగిపోవచ్చు. మరోవైపు బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన సందేశాలు నేరగాళ్లకు చేరే అవకాశం ఉంటుంది. అకస్మాత్తుగా మొబైల్ నెట్‌వర్క్ పనిచేయకపోవడం, ఎస్‌ఎంఎస్‌లు రాకపోవడం వంటి అసాధారణ పరిస్థితులు కనిపిస్తే వెంటనే మొబైల్ ఆపరేటర్‌ను సంప్రదించడం మంచిది. కస్టమర్ కేర్ పేరుతో కొందరు నేరగాళ్లు ప్రత్యేక యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తారు. సమస్య పరిష్కరించేందుకు స్క్రీన్‌ను షేర్ చేయాలని చెబుతారు. కానీ అలా చేస్తే మొబైల్ స్క్రీన్‌పై కనిపించే సమాచారం, ఓటీపీలు, ఇతర సున్నితమైన వివరాలను వారు చూడగలిగే ప్రమాదం ఉంటుంది. అందుకే గుర్తుతెలియని వ్యక్తులు సూచించిన రిమోట్ యాక్సెస్ లేదా స్క్రీన్ షేరింగ్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయకపోవడం, అనుమతి ఇవ్వకపోవడం చాలా ముఖ్యం. నకిలీ కస్టమర్ కేర్.. గూగుల్ సెర్చ్‌తో జాగ్రత్త ఏదైనా యాప్, బ్యాంకు లేదా ఆన్‌లైన్ సంస్థ కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్‌లో వెతికినప్పుడు కనిపించే ప్రతి నంబర్ అధికారికమైనదే అనుకోవద్దు. నకిలీ కస్టమర్ కేర్ నంబర్లను సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్‌లో ప్రచారం చేసే సందర్భాలు ఉన్నాయి. కస్టమర్ కేర్ అవసరమైతే సంబంధిత బ్యాంకు లేదా సంస్థకు చెందిన అధికారిక వెబ్‌సైట్, యాప్‌లో ఉన్న సంప్రదింపు వివరాలను మాత్రమే ఉపయోగించడం సురక్షితం. సైబర్ మోసం జరిగిన తర్వాత ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవడం చాలా కీలకం. డబ్బు పోయిన విషయం తెలిసిన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్