Kaizer News

షఫాలీ విధ్వంసకర శతకం.. టీమిండియా భారీ స్కోర్‌

షఫాలీ విధ్వంసకర శతకం.. టీమిండియా భారీ స్కోర్‌

· National - India · sakshi.com

ఏషియన్‌ గేమ్స్‌ 2026 మహిళల క్రికెట్‌లో భాగంగా ఇవాళ జరుగుతున్న రెండో సెమీఫైనల్లో భారత్‌, బంగ్లాదేశ్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (49 బంతుల్లో 100 నాటౌట్‌; 3 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ చివరి బంతికి సింగిల్‌ తీసి షఫాలీ తన సెంచరీ పూర్తి చేసుకుంది. భారత ఇన్నింగ్స్‌లో స్మృతి మంధన (19 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (33 బంతుల్లో 40; 6 ఫోర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. మిగతా ప్లేయర్లలో కమలిని (3), రిచా ఘోష్‌ (2) నిరాశపరిచారు. బంగ్లా బౌలర్లలో షంజిద అక్తర్‌, రబేయా ఖాన్‌, నహిద అక్తర్‌, మరుఫా అక్తర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. కాగా, ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో శ్రీలంక పాక్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత్‌-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ విజేత స్వర్ణ పతకం కోసం జరిగే ఫైనల్లో శ్రీలంకతో తలపడుతుంది. కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు) ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు) గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) ఫ్లైఓవర్ పై నుంచి పడిన BMW.. కారు తుక్కు తుక్కు టీమిండియాకు మరో తలనొప్పి.. ఆసియా గేమ్స్ లో నఖ్వీ ఎంట్రీ... వెయ్యేళ్ల ప్రళయం.. ముంచెత్తబోతున్న రాకాసి జలపాతం! కాకా కేక పెట్టిస్తాది..! విశ్వంభర గురించి చెప్పలేను ఆ బూత్ బంగ్లా నుంచి డెడ్ బాడీ.. సాయి కృష్ణ కేసుపై అడ్వకేట్ రజిని షాకింగ్ నిజాలు

Original source: sakshi.com
Read more on Kaizer News