Kaizer News

రాష్ట్రంలో దక్షిణాది డీజీపీల సదస్సు

రాష్ట్రంలో దక్షిణాది డీజీపీల సదస్సు

· State - Telangana · ntnews.com

వచ్చే నెలలో నిర్వహణకు ఏర్పాట్లు డీజీపీ సీవీ ఆనంద్‌ వెల్లడి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (నమస్తే తెలంగాణ) : దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సదస్సుకు తెలంగాణ ఆతిథ్యమివ్వనున్నది. వచ్చే నెల లో జరిగే ఈ ప్రాంతీయ సదస్సుకు విసృ్తత ఏర్పాట్లు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వామపక్ష తీవ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, తీరప్రాం త భద్రత, కొత్త తరహా నేర ధోరణులు తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్న ట్టు వెల్లడించారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన స్టాఫ్‌ ఆఫీసర్ల సమావేశంలో ఆయన మానవ వనరుల ఆడిట్‌, పునర్‌వ్యవస్థీకరణ, హోంగార్డుల కొరత, ప్రస్తుతం జరుగుతున్న పోలీస్‌ నియామక ప్రక్రియ, ఐపీఎస్‌ అధికారుల నూతన సం ఘం ఏర్పాటు, ‘క్యూర్‌ ఏరియా’ కమ్యూని టీ కనెక్ట్‌ కార్యక్రమాలు, పరిపాలన, బడ్జెట్‌, సంక్షేమ అంశాలపై సమీక్ష నిర్వహించారు. గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ విభాగాల్లోని 573 మంది సిబ్బందికి 60% అదనపు చెల్లింపులను ఉపసంహరించడం ద్వారా రూ. 28.16 కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు. పోలీస్‌ సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమంపై దృష్టి సారిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ‘ఫిట్‌ కాప్‌’ కార్యక్రమాన్ని అమలు చేయాలని డీజీపీ నిర్ణయించారు. కార్యక్రమంలో డీజీలు, అడిషనల్‌ డీజీలు, సీపీలు, ఐజీలు, డీఐజీలు పాల్గొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News