Kaizer News

Razole: రాజోలులో నాలుగో రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె

Razole: రాజోలులో నాలుగో రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె!

· State - Telangana · hmtvlive.com

Shorts Razole: బీ.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమ సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. తమ దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు కార్యాలయం వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయడంతో పాటు, అర్హత కలిగిన వారికి వెంటనే ప్రమోషన్లు కల్పించాలని వారు కోరుతున్నారు. అలాగే నామిని వీఆర్ఏలను వెంటనే గుర్తించి, వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆశించిన స్థాయిలో పరిష్కారం లభించలేదని వీఆర్ఏలు పేర్కొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వీఆర్ఏలు స్పష్టం చేశారు. “న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది” అని వారు తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News