మండల స్థాయిలో రన్నరప్‌గా నిలిచిన పాఠశాల జట్టు సంగారెడ్డి ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో శనివారం నిర్వహించిన మండల స్థాయి అండర్–17 బాలుర వాలీబాల్ పోటీల్లో సెయింట్ ఆంథోనీ పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. హోరాహోరీగా సాగిన పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన పాఠశాల జట్టు రన్నరప్‌గా నిలిచి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. మండల స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సెయింట్ ఆంథోనీ పాఠశాల జట్టు త్వరలో జరగనున్న జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు అర్హత సాధించింది. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను పాఠశాల చైర్మన్ ఆంథోనీ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రమీల అభినందించారు. జిల్లా స్థాయి పోటీల్లోనూ ఇదే స్ఫూర్తితో రాణించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు