Kaizer News

బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే ఫైనల్‌ సెలబ్రిటీలు వీరే

బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే ఫైనల్‌ సెలబ్రిటీలు వీరే? లిస్ట్‌ చూస్తే మతిపోవడం పక్కా

· Entertainment · tv9telugu.com

బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్ బాస్’ అతి తొందర్లో మొదలు కాబోతోంది. తెలుగులో తొమ్మిది సీజన్లగా ప్రేక్షకులను అలరించిన ఈ షో.. ఇప్పుడు పదో సీజన్‌ మరింత గ్రాండ్‌గా మొదలు కానుంది. ఈ సారి ‘దశావతారం’ అనే కొత్త కాన్సెప్ట్‌తో సీజన్ 10ను డిజైన్ చేశారు బిగ్ బాస్ షో నిర్వాహకులు. ఇప్పటికే రిలీజ్ చేసిన ‘బిగ్ బాబ్ తెలుగు సీజన్ 10’ సంబంధించిన ప్రొమోలు ఈ షోపై మరింత ఇంట్రెస్ట్‌ ను పెంచుతున్నాయి. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోయే సెలబ్రిటీలు వీళ్లే అంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ చక్కర్లు కొడుతోంది. ఇందులో సీరియల్ హీరోయిన్ దేబ్జానీ , ‘గుప్పెడంత మనసు’తో రిషి సార్‌గా ఫేమస్ అయిన ముఖేష్ గౌడ, యాంకర్ వర్షిణి, జబర్దస్త్ కమెడియన్లు రామ్ ప్రసాద్, నరేష్, నటుడు కృష్ణుడు, చైత్ర రాయ్, యాంకర్ సుధీర్ రెడ్డి, టెంపర్ వంశీ, అదిత్ ఈశ్వరన్ పేర్లు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. వీరిలో ముఖేష్ గౌడ ఎంట్రీ ఇస్తే మాత్రం షోకు భారీ క్రేజ్ రావడం ఖాయమనే టాక్ కూడా ఉంది. మరోవైపు కామనర్స్ విషయంలోనూ బిగ్ బాస్ టీమ్ భారీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సెలబ్రిటీలతో పోటీ పడే టాప్ 5 సామాన్యుల ఎంపి ఇప్పటికే హాట్ హాట్ గా జరుగుతోంది. మరి ఈ సెలబ్రిటీల్లో ఎవరిని మీరు బిగ్ బాస్‌ 10లో చూడాలని అనుకుంటున్నారో.. కింద కామెంట్ చేయండి. TOP 9 ET News: ఇరుముడి సూపర్ హిట్.. రూ.కోట్లలో జాక్ పాట్ కొట్టిన రవన్న | సొంత థియేటర్లోనే టాక్సిక్ హవా

Original source: tv9telugu.com
Read more on Kaizer News