Kaizer News

Bellampalli: బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాలలో బతు

Bellampalli: బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాలలో బతుకమ్మ ఆడి విద్యార్థుల నిరసన!

· Technology · hmtvlive.com

Shorts బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని, పాలిటెక్నిక్ విద్యను ఇతర విభాగాల్లో విలీనం చేయవద్దని డిమాండ్ చేస్తూ విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కళాశాల ప్రధాన గేటు ఎదుట విద్యార్థినులు బతుకమ్మ ఆడుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని చాటారు. ​తమ డిమాండ్లకు మద్దతుగా కొనసాగుతున్న మిడ్ పరీక్షలను విద్యార్థులు ముక్తకంఠంతో బహిష్కరించారు. ప్రభుత్వం నుంచి జీవో 97 రద్దుపై స్పష్టమైన, రాతపూర్వకమైన హామీ వచ్చే వరకు నిరసన విరమించేది లేదని, పరీక్షలు కూడా రాసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News