పవన్ కల్యాణ్ వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. నాలుగు జిల్లాలకు సాగు, తాగునీరు అందిస్తుందని పవన్ తెలిపారు. నిర్వాసితుల త్యాగాలను స్మరిస్తూ, వారికి పరిహారం చెల్లింపులు వివరించారు. చంద్రబాబు శంకుస్థాపన చేసిన వెలిగొండ నేడు ఫలించడంపై పవన్ సంతోషం. Pawan Kalyan On Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పానికి, కూటమి పనితీరుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ఎక్స్‌వేదికగా ఆయన తన శుభాకాంక్షలను తెలియజేశారు. " వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభం చారిత్రక ఘట్టమని పవన్ తెలిపారు. నాలుగు జిల్లాల ప్రజల దశాబ్దాల కల నేటితో నెరవేరిందన్నారు. 119 వేల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుందని తెలిపారు. నల్లమల కొండలను ఛేదించి కరవు ప్రాంతాలకు నీరు చేరుతుందని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన ప్రతి ఒక్కరికీ పవన్ కల్యాణ్ అభినందించారు. "వెలిగొండ ప్రాజెక్టు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఇంజినీర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలకు ప్రత్యేక అభినందనలు. వెలిగొండ కోసం 7,300 మందికిపైగా నిర్వాసితులు భూములు, ఇళ్లు కోల్పోయారు. నిర్వాసితుల త్యాగాలు మరువలేనివని పవన్ గుర్తు చేశారు. అందుకే వారి బాగోగుల కోసం కూటమి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. "నిర్వాసితులకు పరిహారం కోసం రూ.905 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం. ఇప్పటికే నిర్వాసితులకు రూ.768 కోట్లు చెల్లింపులు పూర్తి అయ్యాయి. వెలిగొండ కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు ప్రత్యేక కృతజ్ఞతలు." అని అన్నారు. కూటమి ప్రభుత్వ సంకల్పానికి సజీవ సాక్ష్యం వెలిగొండ ప్రాజెక్టు • నాలుగు జిల్లాల ప్రజల దశాబ్దాల కల సాకారానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు నల్లమల కొండలను చీల్చుకుంటూ కృష్ణమ్మ కరవు పీడిత ప్రాంతాలకు చేరనున్న చారిత్రాత్మక ఘట్టమైన వెలిగొండ తొలి దశ ప్రారంభోత్సవాన్ని… వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషిని కూడా పవన్ కల్యాణ్ కీర్తించారు. ఆయన చేతులో మీదుగా శంకుస్థాపన చేసుకున్న ప్రాజెక్టు నేడు పూర్తి అయ్యి నేడు స్టార్ట్ అవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. "1996లో ఉమ్మడి ఏపీ సీఎంగా వెలిగొండకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు సంకల్పంతోనే నేడు వెలిగొండ తొలి దశ ప్రారంభమైంది. వెలిగొండ నీటితో కరవు ప్రాంతాల్లో నీటి ప్రవాహంతో ప్రజల్లో ఆనంద వెల్లివిరిస్తోంది" మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో జల్ జీవన్ మిషన్‌కు వెలిగొండ కీలక నీటి వనరు అని పవన్ తెలిపారు. ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలన్న ప్రధాని మోదీ సంకల్పంలో వెలిగొండ కీలకమన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంలో కష్టపడిన మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వ సంకల్పానికి వెలిగొండ ప్రాజెక్టు సజీవ సాక్ష్యమని పవన్ తన సోషల్ మీడియా సందేశంలో వెల్లడించారు. Frequently Asked Questions వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభంపై పవన్