Kaizer News

ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా పండ్ల పంపిణీ

ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా పండ్ల పంపిణీ

· State - Telangana · prabhanews.com

కంటి ఆసుపత్రిలో రోగులను పరామర్శించిన బీజేపీ నాయకులు ముధోల్, ఆంధ్రప్రభ : ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం ముధోల్‌లోని కంటి ఆసుపత్రిలో రోగులకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆయురారోగ్యాలతో ఉండి, ప్రజలకు మరింత సేవ చేసేలా భగవంతుడు ఆశీర్వదించాలని బీజేపీ నాయకులు ఆకాంక్షించారు. ప్రజా సేవకు అంకితమైన ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తాటివార్ రమేష్, మోహన్ యాదవ్, జీవన్, కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News