Kaizer News

Anakapalli: అనకాపల్లిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’: మెగ

Anakapalli: అనకాపల్లిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’: మెగా కార్డన్ అండ్ సెర్చ్

· State - Telangana · hmtvlive.com

Shorts అనకాపల్లి: మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, సంబంధిత నేరాలను అరికట్టే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం *“ఆపరేషన్ వజ్రప్రహార్”*లో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో ఏకకాలంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. గౌరవ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఈగల్ చీఫ్ ఏకే రవి కృష్ణ, ఐపీఎస్, ఐజీపీ పర్యవేక్షణలో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అనకాపల్లి సబ్ డివిజన్ పరిధిలో డీఎస్పీ ఇ. శ్రీనివాసులు ఆధ్వర్యంలో కశింకోట సీఐ అల్లు స్వామినాయుడు నేతృత్వంలో కశింకోట గ్రామంలోని హౌసింగ్ కాలనీ, పూసర్ల వీధిలో మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పోలీసు అధికారులు, సిబ్బంది, స్పెషల్ టీమ్‌లు, ఈగల్ టీమ్ సంయుక్తంగా అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగం జరుగుతున్నట్లు అనుమానిస్తున్న ప్రాంతాలతో పాటు అద్దె ఇళ్లు, విద్యార్థుల హాస్టళ్లు, ఖాళీ భవనాలు, బస్‌స్టాండ్లు, ఇతర అనుమానాస్పద ప్రదేశాలను పోలీసులు తనిఖీ చేశారు. గతంలో గంజాయి, ఇతర నార్కోటిక్ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తుల వివరాలను కూడా పరిశీలించారు. ఈ ఆపరేషన్‌లో అనకాపల్లి ట్రాఫిక్ సీఐ వెంకట నారాయణ, అనకాపల్లి టౌన్ సీఐ ప్రేమకుమార్, అనకాపల్లి రూరల్ సీఐ అశోక్ కుమార్, ఈగల్ ఇన్‌స్పెక్టర్ ఎస్. నారాయణరావు, కశింకోట ఎస్‌ఐ కె. లక్ష్మణ్ రావు, ఎస్‌ఐ బి. సతీష్తో పాటు సుమారు 70 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మెగా కార్డన్ అండ్ సెర్చ్‌లో భాగంగా పోలీసులు 600 మంది వ్యక్తులను, 150 వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 37 వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. అలాగే 6 లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు ఉన్న వ్యక్తులను గుర్తించి స్పాట్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో మెలగాలని, ఎలాంటి నేర కార్యకలాపాలకు పాల్పడవద్దని పోలీసులు సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, చట్టపరమైన దుష్పరిణామాలపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తుందని వివరించారు. తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల అక్రమ వినియోగం, రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఆపరేషన్‌లో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలతో కలిసి “ఆపరేషన్ వజ్రప్రహార్ ప్రతిజ్ఞ” నిర్వహించారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడి సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విస్తృతంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో సరైన ఇన్సూరెన్స్ లేన

Original source: hmtvlive.com
Read more on Kaizer News