హైదరాబాద్: గోపన్‌పల్లిలోని తాజ్‌నగర్‌లో 50 గజాల్లో నిర్మించిన ఓ ఐదంతస్తుల భవనం అకస్మాత్తుగా ఒకవైపు ఒరిగింది. దీంతో భవనంలో నివసిస్తున్నవారితో పాటు పక్కనున్న భవనంలోని వారు, బస్తీవాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే సీఎంసీ, సర్కిల్, హైడ్రా అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని భవనాన్నే కాకుండా, పక్కనే ఉండే మరో రెండు ఇళ్లవారిని కూడా ఖాళీ చేయించారు. తాజ్‌నగర్‌లో లక్ష్మి (దుబాయ్‌లో నివాసం) అనే మహిళ ఇక్కడ 50 గజాల్లో ఐదంతస్తుల భవనం నిరి్మంచారు. ఒక్కో అంతస్తుకు రెండు గదుల చొçప్పున మొత్తం పది గదులు భవనంలో ఉన్నాయి. దీన్ని బోరబండకు చెందిన మహ్మద్ అజహర్‌కు నెలకు రూ.75 వేలకు అద్దెకివ్వగా ఆయన హాస్టల్ నిర్వహిస్తున్నాడు. ఒక్కో రూములో ఇద్దరు నుంచి ఐదుగురు ఉంటున్నారు. శుక్రవారం ఉదయం భవనం ఓ పక్కకు ఒరుగుతున్నట్లుగా గమనించి స్థానికులు, హాస్టల్‌లో ఉంటున్నవారు అజహర్‌కు సమాచారం అందించారు. అతను భవనాన్ని పరిశీలించి వెళ్ళిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, శేరిలింగంపల్లి సర్కిల్ అధికారులు, హైడ్రా అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఉదయమే ఆ భవనంలో అద్దెకు ఉండే వారందరినీ ఖాళీ చేయించారు. ముందు జాగ్రత్తగా పక్కనే ఉండే మరో రెండు ఇళ్లలో నివాసం ఉండే వారిని కూడా ఖాళీ చేయించారు. కూలి్చవేతకు రంగం సిద్ధం చేస్తున్నారు. భవనానికి ఇరువైపులా గోతులు 50 గజాల స్థలంలోని భవనానికి సమీపంలో దాదాపు వెయ్యి గజాల్లో భారీ భవన నిర్మాణానికి పనులు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ఈ భవనానికి ఇరువైపు భారీ గోతులు తీస్తున్నారు. పెద్దపెద్ద యంత్రాలతో పనులు జరుగుతున్నాయని, ఈ కారణంగానే భవనం ఒరిగి ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. మరోవైపు స్థలంలోనూ నిర్మాణానికి రెండు రోజుల క్రితమే బోరు వేశారు. మార్కెట్లోకి ఐఫోన్ 18 ఎంట్రీ...స్టోర్స్ ముందు క్యూ కట్టిన ఫ్యాన్స్ (ఫొటోలు) బిగ్ బాస్ బ్యూటీ తనూజ ‘హతః’ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) ఖైరతాబాద్ మహా గణపతి...ట్యాంక్ బండ్‌పై సందడిగా నిమజ్జనం (ఫొటోలు) హైదరాబాద్ పంజాగుట్టలో సందడి చేసిన సినీ నటి రాశీ సింగ్ (ఫొటోలు) తిరుమల : సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకరణలో శ్రీమలయప్ప అభయం (ఫొటోలు) BIG DANGER: హైదరాబాద్ తాగునీటిలో విషం వాటర్ ఫిల్టర్లు కూడా కాపాడలేవు! త్వరలోనే బై-ఎలక్షన్స్..? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు..? టాటాకు విన్ఫాస్ట్ షాక్.. బైక్ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ కారు.. ధర తెలుస్తే షాక్ ముగ్గురు పిల్లల్ని కంటాం.. మా జీతాలు పెంచండి.. బాబు పరువు తీసిన CITU నాయకులు రాత్రయితే 90 వేసి పడుకుంటా.. నేను తాగే బ్రాండ్ కూడా అదే