layoffs: సాయంత్రం షిఫ్ట్‌లో ప్రశాంతంగా పని చేసుకుంటున్న ఉద్యోగులకు హఠాత్తుగా ఒక మీటింగ్ ఇన్విటేషన్ వచ్చింది. ఆన్-లైన్‌లో లాగిన్ అయిన కొద్ది నిమిషాల్లోనే వారి జీవితాలు తలకిందులైపోయాయి. ఒక అమెరికన్ ఫైనాన్షియల్ సంస్థలో పనిచేస్తున్న భారతీయ కస్టమర్ సర్వీస్ టీమ్‌కు కేవలం ఐదు నిమిషాల గూగుల్ మీట్ కాల్‌తో ఊహించని షాక్ తగిలింది. ఈ సంఘటనను ఆ టీమ్‌లో పనిచేసిన ఓ ఉద్యోగి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్ (Reddit) వేదికగా పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన ఒక ప్రముఖ బ్యాంక్‌కు సంబంధించి భారత్‌లో ఉన్న కస్టమర్ సపోర్ట్ టీమ్ మొత్తాన్ని ఒక్క దెబ్బకు తొలగించారు. ఆ రోజు సాయంత్రం 6:30 గంటల షిఫ్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు రాత్రి 9:30 గంటల సమయంలో అత్యవసరంగా ఒక గూగుల్ మీట్ లింక్ పంపించారు. తీరా మీటింగ్‌లో జాయిన్ అయ్యాక, భారతీయ కస్టమర్ సర్వీస్ టీమ్ మొత్తాన్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు బాంబు పేల్చారు