ATMs | కరీంనగర్‌లోని ఏటీఎంలలో దొంగలు హల్‌చల్ సృష్టించారు. ఒకే రోజు రెండు ఏటీఎంలలో నగదు చోరీకి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్శేడు, ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ ఎస్‌బీఐ ఏటీఎంలలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ధ్వంసం చేసి నగదుతో పారిపోయారు. చోరీకి పాల్పడిన వారిలో ఓ మహిళ కూడా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్శేడు, ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ ఎస్‌బీఐ ఏటీఎంలలో చోరీకి పాల్పడిన దుండగులు గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ధ్వంసం చేసి నగదుతో పారిపోయిన గుర్తుతెలియని… pic.twitter.com/VYsGfvCtht