గద్వాల, ఆంధ్రప్రభ: జోగులాంబ గద్వాల జిల్లాలో సోమవారం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డిని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అల్లంపూర్‌లోని హరిత హోటల్‌లో జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డికి శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్, నాయకుడు మైలగడ్డ చంద్రశేఖర్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు