కాగజ్‌నగర్‌టౌన్: చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు సోమవారంతో ముగియనుంది. నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వం కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఆహ్వానించడంతో జిల్లావ్యాప్తంగా అర్హులు దరఖాస్తు చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 6,455 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా వితంతువులు 4,682 మంది దరఖాస్తు చేసుకోగా, ఒంటరి మహిళలు 264 మంది, దివ్యాంగులు 1,415 మంది, చేనేత కార్మికులు 38 మంది, గీత కార్మికులు 55 మంది దరఖాస్తు చేసుకున్నారు. వృద్ధులు, బీడీ కార్మికులకు మాత్రం దరఖాస్తు అవకాశం కల్పించలేదు. ఫైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు(కిడ్నీ ఫెయిల్యూర్), దివ్యాంగులు, (తలసేమియా, సికిల్‌సెల్, హీమో ఫీలియా బాధితులు) సరైన ధ్రుపత్రాలు సమర్పించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో ఆఫీస్‌ల్లో.. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని అర్హులు వార్డు అధికారుల ద్వారా మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చేయూత పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తులపై థర్డ్ పార్టీ విచారణ చేయనున్నట్లు సమాచారం. ఆగస్టు 31లోగా వచ్చిన దరఖాస్తులను గెజిటెడ్ అధికారి పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో విచారించనున్నారు. అర్హత, కుటుంబ ఆర్థిక పరిస్థితి, భూమి వాహనాల ఏ మేరకు కలిగి ఉన్నారనే అంశాలను పరిశీలించనున్నారు. ఐదెకరాల లోపు భూమి ఉంటే అర్హతను పరిశీలించే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం ద్వారా మార్గదర్శకాలు జారీ కావాల్సి ఉంది. వృద్ధాప్య పింఛన్లు మాత్రం భర్త మరణిస్తే భార్యకు, భార్య మరణిస్తే భర్తకు పేర్లను ప్రత్యేకంగా కేటాయించిన లాగిన్‌లో నమోదు చేస్తున్నారు. జిల్లాలో చేయూత పింఛన్లకు అర్హులంతా దరఖాస్తు చేసుకోవాలి. మున్సిపాలిటీలు, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. వైకల్య నిర్ధారణకు ప్రత్యేక సదరం శిబిరాలను ఏర్పాటు చేయించాం. నిబంధనల మేరకు అన్ని ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు