Kaizer News

Anakapalli: అనకాపల్లి కలెక్టరేట్‌లో నేడు పీజీఆర్‌ఎ

Anakapalli: అనకాపల్లి కలెక్టరేట్‌లో నేడు పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్!

· State - Telangana · hmtvlive.com

Shorts Anakapalli: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను సోమవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ తెలిపారు. సెప్టెంబర్ 21న సోమవారం ఉదయం 10 గంటలకు అనకాపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా జిల్లాలోని అన్ని మండల, డివిజన్ స్థాయి కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లలో అర్జీలు సమర్పించిన అర్జీదారులు తమ ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు నేరుగా కాల్ చేయాలని కలెక్టర్ సూచించారు. అలాగే ఈ కార్యక్రమాలకు ప్రత్యక్షంగా హాజరు కాలేని అర్జీదారులు Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా తమ అర్జీలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ విజయ క్రిష్ణన్ తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News