Kaizer News

క్రీడాస్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

· Sports · sakshi.com

డాక్టర్‌ ఎన్టీఆర్‌ వ్యవసాయ ఇంజినీరింగ్‌ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ ఎం.సర్దార్‌ బేగ్‌ ఘనంగా ధ్యాన్‌చంద్‌ జయంతి వేడుకలు బాపట్ల: యువత క్రీడా స్ఫూర్తితో ముందుకుపోవాలని డాక్టర్‌ ఎన్టీఆర్‌ వ్యవసాయ ఇంజినీరింగ్‌ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ ఎం.సర్దార్‌ బేగ్‌ పేర్కొన్నారు. హాకీ క్రీడాకారుడు, పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి కార్యక్రమం స్థానిక కళాశాలలో శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మేజర్‌ ధ్యాన్‌చంద్‌ భారత హాకీకి అందించిన విశిష్ట సేవలు, ఆయన అద్భుతమైన క్రీడా ప్రతిభ, క్రమశిక్షణ, దేశభక్తి నేటి యువతకు గొప్ప స్ఫూర్తిదాయకమని అన్నారు. క్రీడలు కేవలం శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా, విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సమష్టి కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం, క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతిరోజూ కొంత సమయాన్ని శారీరక వ్యాయామం, క్రీడలకు కేటాయించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్‌ అశోక్‌ కుమార్‌, బోధన సిబ్బంది డాక్టర్‌ రవిబాబు, డాక్టర్‌ రామిరెడ్డి, డాక్టర్‌ శ్రీనివాసులరెడ్డి, డాక్టర్‌ విష్ణువర్ధన్‌, డాక్టర్‌ రాజ్‌కిరణ్‌, బోధనేతర సిబ్బంది విజయ కుమారి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. చుండూరు(వేమూరు): ప్రతి పాఠశాలల్లో మాతృ భాషకు ప్రాధాన్యమివ్వాలని జిల్లా విద్యా శాఖ అధికారి డి.శ్రీనివాస్‌ తెలిపారు. చుండూరు మండలం యడ్లపల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శనివారం తెలుగు భాష, జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. తల్లిదండ్రులను వృద్దాశ్రమాల్లో చేర్చవద్దని, సెల్‌ఫోన్‌ వల్ల కలిగే నష్టాలు స్కిట్‌ని విద్యార్థులు ప్రదర్శంచారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా పాఠశాలలో పోటీలు నిర్వహించి విజేతలకు సర్టిఫికెట్‌, మెడల్స్‌ అందజేశారు. డీఈఓ మాట్లాడుతూ పాఠశాల అన్ని రంగాల్లో ముందు ఉంటుందన్నారు. జిల్లా బెస్ట్‌ పాఠశాలగా గుర్తింపు పొందడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుర్రా శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు బిట్రా వెంకటసుబ్బారావు, ఐ సామ్రాజ్యం, డి నాగరాజు, ప్రసాద్‌బాబు, అప్పారావు, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, ఇందిరాదేవి, వాణి, శుభ్రశ్రీ, విజయనిర్మల, రాంబాబు, నవీన్‌, వంశీ, తిరుపతిరావు, శాండీ వసంత, జాన్‌వెస్లీ, విద్యార్థులు పాల్గొన్నారు. శారీరక దృఢత్వంతోపాటు మానసిక స్థైర్యాన్ని నింపే ఏకై క రంగం క్రీడా రంగమని, ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం ఒక గంటపాటు క్రీడా మైదానంలో తమకు నచ్చిన క్రీడను సాధన చేయడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ పి.ప్రసూన రాణి అన్నారు. వ్యవసాయ కళాశాలలో శనివారం జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొ

Original source: sakshi.com
Read more on Kaizer News