Anantapur: గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుమార్తె, అనంతపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కుమారుడి వివాహ వేడుక ఘనంగా జరిగింది. అనంతపురం పట్టణంలోని ఎమ్‌వైఆర్ కన్వెన్షన్‌లో జరిగిన ఈ వివాహానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. నూతన వధూవరులు శివరాజు–విద్యలను సీఎం చంద్రబాబు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. సీఎం రాకతో వివాహ వేదిక వద్ద సందడి నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వివాహ వేడుకకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన దంపతులను ఆశీర్వదించిన అనంతరం కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు. వివాహ వేడుక సందర్భంగా ముఖ్యమంత్రిని టీడీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వివాహ వేడుకలో రాజకీయ, సామాజిక ప్రముఖుల రాకతో మరింత కళ సంతరించుకుంది. రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’