Kaizer News

Guntur: ప్రతి నీటి బొట్టునూ స్వచ్ఛంగా అందిస్తాం: గ

Guntur: ప్రతి నీటి బొట్టునూ స్వచ్ఛంగా అందిస్తాం: గుంటూరు ఎమ్మెల్యే నసీర్!

· State - Telangana · hmtvlive.com

గుంటూరు: నగర ప్రజలకు ప్రతి నీటి బొట్టునూ స్వచ్ఛంగా అందిస్తామని, ప్రజలు ఎలాంటి అపోహలు పడొద్దని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ సూచించారు. ఆదివారం స్థానిక తక్కెళ్ళపాడు రిజర్వాయర్, నెహ్రు నగర్ తోపాటు ఇతర ఈఎల్ఎస్ పాయింట్లను ఎమ్మెల్యే నసీర్ స్వయంగా పరిశీలించారు. గుంటూరు నగరంలో కొన్ని ప్రాంతాలలో అపరితమైన నీరు సరఫరా అవుతుందన్న ఫిర్యాదుల నేపథ్యంలో శుద్ధీకరణ వ్యవస్థల గురించి‌ వాటర్ సప్లై అధికారులతో మాట్లాడి ప్రతి వ్యవస్థలో మంచినీటి శుద్ధి జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. తక్కెళ్లపాడు రిజర్వాయర్ కు కృష్ణా నది నుంచి రా వాటర్ సరఫరా జరుగుతుందని, ఈ నీరు పట్టిసీమ నుంచి రావడంతో కొంత రంగు మారిందని చెప్పారు. అయితే ప్రతి రిజర్వాయర్ వద్ద క్లోరినేషన్ నుంచి ట్యాంకుల ద్వారా ఇంటింటికి సరఫరా వరకు అంచలంచల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. సచివాలయ ఎమినిటీస్ సెక్రటరీలు ప్రతి రోజూ ప్రతి పది ఇళ్లకు ఒక ఇంటికి సరఫరా అవుతున్న నీటిని పరిశీలించాలని సూచించారు. ప్రజలు ఎలాంటి అపోహలు చెండాల్సిన పనిలేదని స్వచ్ఛమైన నీరు అందిస్తున్నామని చెప్పారు. క్లోరి నేషన్ గాని, ట్యాంకుల శుభ్రతగానీ పక్కాగా జరుగుతుందన్నారు. ప్రజలకు ఇంకా ఎక్కడైనా అపరిశుభ్రత నీటి సరఫరా జరుగుతుంటే వెంటనే 103కి ఫిర్యాదు చేయాలని, మున్సిపల్ సిబ్బంది చర్యలు చేపడతారని తెలిపారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News