Kaizer News

Amalapuram: అమలాపురం ప్రజాదర్బార్‌లో 42 అర్జీలు స్

Amalapuram: అమలాపురం ప్రజాదర్బార్‌లో 42 అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే!

· State - Telangana · hmtvlive.com

Shorts అమలాపురం: ఈ రోజు అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందరావు పాల్గొని, నియోజకవర్గ నలుమూలల నుండి విచ్చేసిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజాదర్బార్ వేదికగా వివిధ సమస్యలపై ప్రజల నుండి మొత్తం 42 వినతి పత్రాలను ఎమ్మెల్యే స్వయంగా అందుకోవడం జరిగింది. ప్రతి ఒక్క అర్జీదారుడితో నేరుగా మాట్లాడి వారి సమస్యలను కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు.అనంతరం అర్జీలపై తక్షణమే స్పందించి, ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని,ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూడటమే తమ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News