Kaizer News

Adilabad: ఆదిలాబాద్‌లో ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభల వాల్

Adilabad: ఆదిలాబాద్‌లో ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభల వాల్‌పోస్టర్ల విడుదల!

· National - India · hmtvlive.com

Shorts Adilabad: ఈనెల 28, 29, 30 తేదీలలో ఖమ్మంలో జరగబోయే అఖిల భారత రైతు కూలి సంఘం(AIKMS) నాలుగవ జాతీయ మహాసభల వాల్ పోస్టర్ లను ఆదిలాబాద్ లో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం(AIKMS) రాష్ట్ర సహాయ కార్యదర్శి K సాయన్న మాట్లాడుతూ ఈ మహాసభలలో దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు, సంఘం జాతీయ నాయకులు హాజరవుతారు అన్నారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల కరువు నెలకొంది కావున అదిలాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులకు వాణిజ్య పంటలకు ఎకరాకు 20 వేల రూపాయలు, ఆహార పంటలకు ఎకరాకు పదివేల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని చెల్లించాలి. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తానన్న రాష్ట్ర ముఖ్యమంత్రి హామీని అమలు చేయాలన్నారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

Original source: hmtvlive.com
Read more on Kaizer News