Kaizer News

Mugguru Kothulu | యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్

Mugguru Kothulu | యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ‘ముగ్గురు కోతులు’ టైటిల్ సాంగ్ విడుదల

· Entertainment · ntnews.com

టాలీవుడ్‌లో కొత్త ప్రయత్నాలతో వస్తున్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంది. అదే కోవలో తాజాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సరికొత్త యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ముగ్గురు కోతులు’. జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్తీక్ గరిమెల్ల దర్శకత్వ వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొనగా, తాజాగా మేకర్స్ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను విడుదల చేసి సినిమాపై హైప్ మరింత పెంచేశారు. ‘ముగ్గురు కోతులు’ అంటూ సాగే ఈ వీడియో సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలో ముగ్గురు హీరోలు తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ఫుల్ ఎనర్జీతో కనిపించి సందడి చేశారు. సింగిల్ మరియు బ్యాచిలర్ లైఫ్ తాలూకు సరదాలు, కష్ట-నష్టాలను ఎంతో వినోదాత్మకంగా ఈ పాటలో చూపించారు. క్యాచీ ట్యూన్, హీరోల అల్లరి పనులు సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ పాటకు జగదీష్ బుసయవలస అందించిన అర్థవంతమైన సాహిత్యం, చైతన్య గన్నవరపు అద్భుతమైన గాత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులలోకి బలంగా దూసుకెళ్లగా, ఇప్పుడు వచ్చిన టైటిల్ సాంగ్ సినిమా స్థాయిని మరింత పెంచింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఎస్. సుహాస్ సంగీతం అందిస్తుండగా, రాజ్ నోముల సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే జమీర్ షేక్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్లను త్వరలోనే మేకర్స్ వరుసగా విడుదల చేయనున్నారు. నూతన నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల కలయికలో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి

Original source: ntnews.com
Read more on Kaizer News