Shorts Nellore: రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో 1200 కోట్ల చెత్త దోపిడిని నిరసిస్తూ.. నెల్లూరు వి ఆర్ సి సెంటర్ లో వైసిపి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైస్సార్సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్,ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలతోకలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలలో 1200 కోట్ల రూపాయల చెత్త దోపిడికి పాల్పడ్డ మంత్రి నారాయణ ప్రజలకు సమాధానం చెప్పాలంటూ వైసిపి కార్యకర్తలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీనిపై మంత్రి నారాయణ బహిరంగ చర్చకు రావాలంటూ.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.. చెత్తలో దోపిడీకి పాల్పడింది వాస్తవం కాదా మంత్రి నారాయణ సమాధానం చెప్పాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు అడుగుతున్న .. ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానం చెప్పలేక తప్పించుకు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే మీరు చెత్తలో 1200 కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడినట్లు.. వైస్సార్సీపీ అన్ని ఆధారాలు బయటపెట్టిన మంత్రి నారాయణకు చీమకుట్టినట్లైనా లేదన్నారు. ఈరోజు పేదవాడి దగ్గర నుంచి బలవంతంగా పన్నులు వసూలు చేసి.. ఆ సొమ్ము దోపిడీకి పాల్పడడానికి మీకు మనసెలా వచ్చిందని ప్రశ్నించారు. ప్రెస్ మీట్ పెట్టి.. నేను అంత దోచుకోలేదు ఇంత దోచుకోలేదు అని మాట్లాడే మంత్రి నారాయణ .. దీనిపై.. బహిరంగ చర్చకు వచ్చి నిజా నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.... ఈరోజు చెత్తలో 1200 కోట్ల రూపాయల దొపిడి కి మంత్రి నారాయణ సమాధానం చెప్పితీరాలని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. చెత్తలో దోపిడీకి పాల్పడ్డ ఈ ప్రభుత్వం ఒక చెత్త ప్రభుత్వమన్నారు. ఈరోజు పేదవాడి రక్తం పిండి వసూలు చేస్తున్న ఈ పన్నుల సొమ్మును దోచుకోవడానికి మీకు మనసెలా వచ్చిందో చెప్పాలన్నారు. గతంలో వీఆర్ఐ హై స్కూల్ అభివృద్ధి పేరుతో 10 కోట్ల రూపాయల దోపిడీకి.. అంచనాలు రూపొందించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అలాగే చెట్లలో దోపిడీకి తెర తీసేందుకు.. ఒక్కొక్క చెట్టుకు 12 వేల రూపాయలు.. దోచుకునేందుకు స్కెచ్ వేసిన మాట నిజం కాదా..? చెప్పాలన్నారు. ఈ రెండు అంశాలపై వైయస్ఆర్సీపీ.. ప్రజల ముందుకొచ్చి మాట్లాడిన తర్వాత మీరు వెనక్కి తగ్గారని అన్నారు. అలాగే జాఫర్ సాహెబ్ కెనాల్.. వద్ద ఏర్పాటు చేసిన స్ట్రీట్ వెడ్డింగ్ ప్రాజెక్టులో .. మీకు సంబంధించిన వారు బొంకులు పెట్టుకునేందుకు.. కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి 8 కోట్ల రూపాయలు డ్రా చేసిన మాట వాస్తవం కాదా...,? ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన.. తర్వాత మీ బినాలమీలకు లబ్ధి చేకూర్చేందుకు.. క్లాప్ ఆటోలను పక్కనపెట్టి..ట్రాక్టర్ల పేరుతో మీ బినామీలకు దోచి పెట్టింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు...కంపాక్ట్, స్వీపింగ్ మిషన్స్.. ఒక్కొక్క దాని అసలు ధర ఎంత..? మీరు కొనుగోలు చేసిన ధర ఎంత చెప్పాలన్నారు. అలాగే ఇందుకు సంబంధించిన టెండర్స్ లో బయట వారు ఎవరు పాల్గొనకుండా.. మీకు సంబంధించి