Kaizer News

సుభాష్ చంద్ర రూ.6 కోట్ల సెటిల్‌‌మెంట్‌‌ పై ఎల్‌‌‌‌

సుభాష్ చంద్ర రూ.6 కోట్ల సెటిల్‌‌మెంట్‌‌ పై ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీ, కెనరా న్యాయపోరాటం..

· State - Telangana · v6velugu.com

న్యూఢిల్లీ: దాదాపు రూ.22 వేల కోట్ల అప్పులను కేవలం రూ.6.25 కోట్లు చెల్లించి సెటిల్ చేసుకునేందుకు జీ గ్రూప్ ఫౌండర్ సుభాష్ చంద్రకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ) అనుమతివ్వడంపై న్యాయపోరాటం చేస్తామని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించాయి. ఈ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ ఉత్తర్వులను సవాలు చేస్తూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)లో వెంటనే అప్పీల్ దాఖలు చేస్తామని పేర్కొన్నాయి. హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్ కూడా ఈ పరిష్కారానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళతామని తెలిపింది. సుభాష్​ చంద్ర ఆఫర్ చేసిన పరిష్కార ప్రణాళికను ప్రభుత్వ రంగ సంస్థలు గట్టిగా వ్యతిరేకించినప్పటికీ, ఇతర ఫైనాన్షియల్ క్రెడిటర్లు (ప్రధానంగా ప్రైవేట్ క్రెడిటర్లు) 80.81శాతం మెజారిటీ ఓటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఈ ప్లాన్ ఆమోదం పొందింది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మూడు సంస్థలు కలిపి మొత్తం 8.45శాతం ఓటింగ్ వాటాతో ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా ఓటు వేశాయి. కెనరా బ్యాంక్ ఈ వ్యవహారంలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేసినప్పటికీ, మైనారిటీ ఓటింగ్ వాటా కారణంగా ఆ అభ్యర్థన వీగిపోయిందని వెల్లడించింది. ఎస్సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (జీ గ్రూప్‌‌‌‌) కు సంబంధించిన వివేక్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాకాన్ అనే సంస్థ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (ప్రస్తుతం సమ్మాన్ క్యాపిటల్) నుంచి సుమారు రూ.170 కోట్ల రుణం తీసుకుంది. ఈ రుణానికి గ్రూప్ ప్రమోటర్, చైర్మన్ హోదాలో సుభాష్ చంద్ర వ్యక్తిగత హామీ ఇస్తూ సంతకం చేశారు. వివేక్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాకాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ రుణాన్ని చెల్లించలేకపోవడంతో ఇండియా బుల్స్‌‌‌‌ హౌసింగ్ ఫైనాన్స్‌‌‌‌ సుభాష్ చంద్రకు వ్యతిరేకంగా ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీకి వెళ్లింది. బ్యాంకింగ్, ఐబీసీ నిబంధనల ప్రకారం, రుణం తీసుకున్న కంపెనీ డిఫాల్ట్ అయితే దానికి వ్యక్తిగత హామీ ఇచ్చిన ప్రమోటర్ నుంచి ఆ బకాయిలను వసూలు చేసుకునే హక్కు క్రెడిటర్లకు ఉంటుంది. ఐబీసీ చట్టం ప్రకారం ఒక వ్యక్తిపై దివాలా ప్రక్రియ మొదలవగానే, ఆయన వ్యక్తిగత గ్యారెంటీ ఇచ్చిన ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలన్నీ వరుస కట్టాయి. ఫలితంగా, ఇండియాబుల్స్ రూ.170 కోట్ల కేసుతో మొదలైన వ్యవహారం కాస్తా.. అన్ని బ్యాంకుల మొత్తం క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కలిపి రూ.22 వేల కోట్లకు చేరింది

Original source: v6velugu.com
Read more on Kaizer News