Kaizer News

కరీంనగర్ అభివృద్ధిపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు ; స

కరీంనగర్ అభివృద్ధిపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు ; సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి

· State - Telangana · v6velugu.com

కరీంనగర్ సిటీ, వెలుగు: నగర అభివృద్ధిపై బీజేపీ పాలకవర్గానికి చిత్తశుద్ధి లేదని కరీంనగర్​సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. మార్కెట్ రోడ్డు వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కూరుకుపోయిన డ్రైనేజీని ఆదివారం ఆయన పరిశీలించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు దండుకున్న నేతలు.. ఇప్పుడు ప్రజల సమస్యలను గాలికి వదిలేసి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఆధిపత్య పోరుపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో లేదని విమర్శించారు. నగర అభివృద్ధికి ఇప్పటికైనా కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ , నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కృషి చేయాలని సూచించారు

Original source: v6velugu.com
Read more on Kaizer News