సీఎం రేవంత్ ఇలాఖాలో కవిత సంచలన వ్యాఖ్యలు కోస్గి పాంచజన్య సంకల్ప సభలో భావోద్వేగ ప్రసంగం.. మోదీ, రేవంత్, కేసీఆర్‌తోనైనా పోరాడుతానన్న కవిత కోస్గి, ఆంధ్రప్రభ : తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని కోస్గిలో నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఎవరో వదిలిన బాణం అంటూ విమర్శలు చేస్తున్న వారికి కవిత ఘాటుగా సమాధానం ఇచ్చారు. తాను బీఆర్‌ఎస్ వదిలిన బాణాన్ని కాదని, కాంగ్రెస్ లేదా బీజేపీ బాణాన్ని కాదని.. దశాబ్దాలుగా అధికారానికి, విద్యకు దూరంగా ఉన్న తెలంగాణ బహుజనుల బాణాన్ని అని స్పష్టం చేశారు. కోస్గి జూనియర్ కాలేజీ మైదానంలో జరిగిన ఈ సభకు కవిత భారీ ర్యాలీగా చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి సుమారు 200 కార్లతో కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. కొడంగల్ నుంచి కోస్గి వరకు కవిత ప్రత్యేక బస్సులో ప్రయాణించారు. దారిపొడవునా కార్యకర్తలు, మహిళలు ఆమెకు స్వాగతం పలికారు. సభా ప్రాంగణం వేలాది మంది ప్రజలు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. సభలో కవిత మాట్లాడుతూ.. కొడంగల్ గడ్డపై పాంచజన్య శంఖారావం మార్మోగిందన్నారు. 2009 ఎన్నికల సమయంలో ఇదే కోస్గి కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించిన ప్రచార సభకు తాను, చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి కలిసి వచ్చామని గుర్తు చేశారు. ఆ సమయంలో తమతో కలిసి ప్రచారం చేసిన చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఇద్దరూ ముఖ్యమంత్రులు అయ్యారని అన్నారు. తాను అప్పటి ప్రచారంలో మూడో వ్యక్తినని, కోస్గి సెంటిమెంట్, కొడంగల్, ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రజల ఆశీస్సులు తనకు ఉండాలని కోరారు. ఈ సందర్భంగా సభలో కార్యకర్తలు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. “నన్ను కాంగ్రెస్ వదిలిన బాణమని కొందరు అంటున్నారు. కేసీఆర్ వదిలిన బాణమని రేవంత్‌రెడ్డి అంటున్నారు. మరికొందరు బీజేపీ బాణమని చెబుతున్నారు. కానీ నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు. కొడంగల్ గడ్డపై నుంచి చెబుతున్నా.. నేను తెలంగాణ బహుజనుల బాణాన్ని. యువత యుద్ధ నినాదాన్ని. జ్యోతిబా ఫూలే ఆత్మగౌరవ నినాదాన్ని, అంబేడ్కర్ వాదాన్ని, సావిత్రిబాయి ఫూలే ఆశయాల కోసం నిలబడిన వీర వనితను” అని అన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే ప్రధాని నరేంద్ర మోదీతో అయినా, సీఎం రేవంత్‌రెడ్డితో అయినా, మాజీ సీఎం కేసీఆర్‌తో అయినా పోరాడేందుకు సిద్ధమని కవిత ప్రకటించారు. ఒక మహిళ ఎవరి మద్దతు లేకుండా రాజకీయంగా ఎదగగలదని నిరూపించేందుకు తాను ముందుకు వచ్చానని చెప్పారు. దేశంలో మహిళలను మహారాణులుగా కీర్తిస్తున్నప్పటికీ, వంటింట్లోని గిన్నెలపై కూడా మగవారి పేర్లే ఉంటాయని కవిత వ్యాఖ్యానించారు. 29 రాష్ట్రాలు ఉన్న దేశంలో కేవలం ఒక్క రాష్ట్రానికి మాత్రమే మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. ఇన్నాళ్లు పురుషుల పాలన చూశామని, ఇక తెలంగాణలో మాతృస్వామ్య ఆలోచన రావాల్సిన అవసరం ఉందన్నారు. తనకు అవకాశం ఇస్తే ఒక తల్లిలా ఆలోచించి పాలన అందిస్తానని అన్నారు. విద్య, వైద్యం కోసం లక్ష కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చినా వెనుకాడబోనని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై కవిత తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరో