Kaizer News

మిర్చి తోటకు వెళ్తూ.. మృత్యువు ఒడిలోకి!

మిర్చి తోటకు వెళ్తూ.. మృత్యువు ఒడిలోకి!

· State - Telangana · prabhanews.com

విద్యుత్ షాక్‌తో రైతు దుర్మరణం… ఇద్దరు చిన్నారులకు తండ్రి దూరం రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబంలో తీరని విషాదం నర్సంపేట రూరల్, సెప్టెంబర్ 18 (ఆంధ్రప్రభ): మిర్చి తోట సాగు చేసుకుని కుటుంబాన్ని పోషించేందుకు పొలానికి బయలుదేరిన ఓ రైతును విద్యుత్‌ ప్రమాదం బలిగొంది. కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తి ఒక్కసారిగా మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఇద్దరు చిన్నారులకు తండ్రిని దూరం చేసిన ఈ ఘటన స్థానికులను కలచివేసింది. నర్సంపేట మండల పరిధిలోని ఏనుగుల తండా ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ భూముల్లో శుక్రవారం ఉదయం ఈ విషాద ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. తండాకు చెందిన భూక్య శీను (45), తండ్రి నారాయణ మిర్చి తోట సాగు పనుల కోసం పొలానికి వెళ్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురైనట్లు స్థానికులు తెలిపారు. ఉదయం సుమారు 10.30 నుంచి 11 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కష్టాన్నే నమ్ముకుని.. వ్యవసాయమే జీవనాధారంగా చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్న శీను మిర్చి తోట ఏర్పాటు చేసుకునేందుకు పొలానికి వెళ్లారు. రోజువారీ కష్టంతో కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్న ఆయనకు ఊహించని విధంగా విద్యుత్‌ ప్రమాదం ఎదురైంది. కుటుంబం కోసం బయలుదేరిన వ్యక్తి తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తండ్రిని కోల్పోయిన చిన్నారులు, శీనుకు ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడంతో ఆ పిల్లల భవిష్యత్తుపై కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే తండ్రిని కోల్పోయిన కుటుంబానికి ఇప్పుడు శీను మృతి మరో పెద్ద విషాదాన్ని మిగిల్చింది. విద్యుత్‌ తీగలపై ఆందోళన, వ్యవసాయ భూముల వద్ద విద్యుత్‌ తీగలు, స్తంభాల పరిస్థితిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. రైతులు వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే సమయంలో విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న శీను మృతి చెందడంతో వారి కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. వ్యవసాయాన్ని నమ్ముకుని జీవించే కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాదం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది

Original source: prabhanews.com
Read more on Kaizer News