Kaizer News

Aswapuram: అశ్వాపురం ZPHSలో స్వచ్ఛత హి సేవ: డీపీవో

Aswapuram: అశ్వాపురం ZPHSలో స్వచ్ఛత హి సేవ: డీపీవో అనూష

· State - Telangana · hmtvlive.com

Shorts భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో స్వచ్ఛత హి సేవ–2026-27 కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డిపిఓ అనూష గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిపిఓ అనూష గారు విద్యార్థులకు నాలుగు రకాల చెత్తను వేరు చేసే విధానం, ప్లాస్టిక్ రహిత గ్రామం, నీటి పొదుపు, మొక్కల పెంపకం, ప్రకృతి పరిరక్షణ, గ్రామ పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పించారు. స్వచ్ఛత, పచ్చదనం, చెత్త సేకరణ, పర్యావరణ పరిరక్షణ అంశాలపై విద్యార్థులకు వ్యాసరచన పోటీల్లో 25 మంది విద్యార్థులు పాల్గొనగా, అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు డిపిఓ అనూష గారి చేతుల మీదుగా మొదటి మూడు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ముత్యాలరావు గారు,సర్పంచ్ బానోత్ సదర్ లాల్ గారు , ఉప సర్పంచ్ తుల్లూరి ప్రకాశరావు, పాఠశాల హెచ్‌ఎం యోగితా వేణి మరియు ఇతర ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి యాకుబ్, పంచాయతీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News