Kaizer News

‘రేవంత్ ప్రభుత్వంలో దోపిడీ తప్ప అభివృద్ధి శూన్యం’

‘రేవంత్ ప్రభుత్వంలో దోపిడీ తప్ప అభివృద్ధి శూన్యం’

· State - Telangana · ntnews.com

బీఆర్‌ఎస్‌ వైరా నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్‌జేసీ కృష్ణ – వైరాలోని మిట్టపల్లి గార్డెన్‌లో బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం వైరా, ఆగ‌స్టు 31 : రేవంత్ ప్రభుత్వంలో దోపిడీ తప్ప అభివృద్ధి శూన్యమని, వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ చేసిన ఒక్క‌ అభివృద్ధినైనా చూపించాలని బీఆర్‌ఎస్‌ వైరా నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్‌జేసీ కృష్ణ సవాల్ విసిరారు. సోమ‌వారం వైరాలోని మిట్టపల్లి గార్డెన్‌లో బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టే నిరసన కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 420 హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను పూర్తిగా మరిచిందని ప్రభుత్వాన్ని విమర్శించారు. వైరా నియోజకవర్గ వ్యాప్తంగా సెప్టెంబర్ 2 నుండి 8 వరకు జరిగే వెయ్యి రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాల‌ను ప్రజలకు తెలియజేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు, వైరా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ భాను చంద్రావ‌తి, జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జునరావు, బాణాల వెంకటేశ్వరరావు, వనమా విశ్వేశ్వరరావు, లకావ‌త్ గిరిబాబు, బానోత్ మనీషా లక్ష్మి, ముత్యాల సత్యనారాయణ, పోట్ల శ్రీనివాసరావు, ముత్యాల వెంకట అప్పారావు, మద్దెల రవి, అప్పం సురేశ్‌, లాల్ అహ్మద్, ఏదునూరి శ్రీను, మరికంటి శివ, చిలక తిరుపతి, శ్రీను, భాను, సక్కుబాయి, వదినేపల్లి చక్రవర్తి, మెట్టపల్లి సత్యబాబు, వాసిరెడ్డి శంకర్‌రావు, దామా లిఖిత్ చౌదరి, మాటేటి కిరణ్, చల్లా మోహన్ రావు, కారుకొండ బోస్, కందుల ఓంకార్, వాసంగలపాటి శివ, వాంకుడోత్ జగన్, ఇత‌ర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News