Kaizer News

Veldanda: బీఆర్ఎస్ నేతల కుటుంబాలను పరామర్శించిన డా

Veldanda: బీఆర్ఎస్ నేతల కుటుంబాలను పరామర్శించిన డాక్టర్ విజితా రెడ్డి

· State - Telangana · hmtvlive.com

వెల్దండ: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొండల్ తల్లి నరసమ్మ బాయ్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ఉద్యమకారురాలు కల్వకుర్తి మాజీ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ విజితా రెడ్డి వారి నివాసానికి వెళ్లి మృతదేహానికి పూలమాలతో నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతురాలు కుమారుడికి తక్షణమే 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. అనంతరం చెరుకూరు గ్రామంలో గోలి దశరథ్ రెడ్డి అకస్మాత్తుగా మృతి చెందారు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతుదేహానికి పూలమాలతో నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అధైర్య పడొద్దు ధైర్యంగా ఉండాలని అన్నారు. అనంతరం వెల్దండ మండల కేంద్రంలో పుట్ట శ్రీశైలం నిన్న యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది వారి నివాసం కి వెళ్లి మృతుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆనంద్ రెడ్డి మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ మండల యూత్ వింగ్ అధ్యక్షుడు యాదగిరి మార్కెట్ మాజీ డైరెక్టర్ వీరారెడ్డి గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అలీల్ రఘు గౌడ్ అన్వర్ పాషా గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News