Kaizer News

సునీల్‌ నరైన్‌ ఉగ్రరూపం

సునీల్‌ నరైన్‌ ఉగ్రరూపం

· Sports · sakshi.com

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2026లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌ ఉగ్రరూపం దాల్చాడు. బార్బడోస్‌ ట్రైడెంట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బంతితో, ఆ తర్వాత బ్యాట్‌తో చెలరేగిపోయాడు. ఫలితంగా అతడి జట్టు నైట్‌రైడర్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌లో చేసిన నైట్‌రైడర్స్‌ నరైన్‌ (4-0-14-2) మరోసారి బంతితో మ్యాజిక్‌ చేయడంతో ప్రత్యర్దిని 127 పరుగులకే (20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. ట్రైడెంట్స్‌ ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేసిన జకరి కార్టర్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇతనితో పాటు కెప్టెన్‌ క్రిస్‌ గ్రీన్‌ (27) మాత్రమే 20కి పైగా పరుగులు చేశాడు. షైన్‌ బ్రాత్‌వైట్‌ (13), క్వింటన్‌ (11), షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (12), రివాల్డో క్లార్క్‌ (15 నాటౌట్‌) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా ప్లేయర్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. నైట్‌రైడర్స్‌ బౌలర్లలో నరైన్‌తో పాటు కీరన్‌ పోలార్డ్‌ (3-0-9-2) కూడా బంతితో సత్తా చాటాడు. అనంతరం నైట్‌రైడర్స్‌ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగగా.. ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌ (33 బంతుల్లో 55; ఫోర్‌, 6 సిక్సర్లు) తొలి బంతి నుంచే విధ్వంసం సృష్టించాడు. మరో ఓపెనర్‌ కొలిన్‌ మున్రోతో (26 బంతుల్లో 37; 5 ఫోర్లు, సిక్స్‌) కలిసి తొలి వికెట్‌కు 95 పరుగులు జోడించి, నైట్‌రైడర్స్‌ గెలుపును ఖాయం చేశాడు. వీరిద్దరు ఔటయ్యాక నికోలస్‌ పూరన్‌ (12) నిరాశపరిచినా, పోలార్డ్‌ (12 నాటౌట్‌), గూలీ (6 నాటౌట్‌) సునాయాసంగా నైట్‌రైడర్స్‌ను గెలుపు తీరాలు దాటించారు. ఈ జట్టు కేవలం 14.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారీ రికార్డులు సాధించిన పోలార్డ్‌, నరైన్‌ నైట్‌రైడర్స్‌ దిగ్గజాలు కీరన్‌ పోలార్డ్‌, సునీల్‌ నరైన్‌ ఇటీవలే జరిగిన ఓ మ్యాచ్‌లో భారీ రికార్డులు సాధించారు. పోలార్డ్‌ బట్లర్‌ను అధిగమించి టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అవతరించగా.. నరైన్‌ రషీద్‌ ఖాన్‌ (736) తర్వాత టీ20ల్లో 650 వికెట్ల మార్కు తాకిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి కేసులో కొత్త ట్విస్ట్

Original source: sakshi.com
Read more on Kaizer News