Kaizer News

Siddipet: ఎర్రవల్లిలో మూడో రోజుకు చేరిన రెవెన్యూ అ

Siddipet: ఎర్రవల్లిలో మూడో రోజుకు చేరిన రెవెన్యూ అధికారుల సర్వే!

· State - Telangana · hmtvlive.com

Shorts Siddipet: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలో రెవెన్యూ అధికారుల భూ సర్వే మూడో రోజుకూ కొనసాగుతోంది. సర్వే నంబర్ 325లోని భూములకు సంబంధించి అధికారులు క్షేత్రస్థాయిలో తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మొత్తం మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు ఇవాళ ఉదయం నుంచే సర్వే ప్రక్రియను ప్రారంభించారు. నిన్న శాటిలైట్ సాంకేతికత ద్వారా ఎర్రవల్లి, దాని శివారు గ్రామాలైన వెంకటాపూర్, వరదరాజ్‌పూర్ సరిహద్దుల్లోని సర్వే నంబర్ 325 హద్దులను అధికారులు పక్కాగా గుర్తించారు. ఇందులో భాగంగానే ఇవాళ సర్వే నంబర్ 325 పరిధిలో ఉన్న అసైన్డ్ భూముల బౌండరీలకు మార్కింగ్ వేసే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా, ఈ సర్వే నంబర్‌లోని మొత్తం భూ విస్తీర్ణాన్ని పక్కాగా కొలతలేసి గుర్తించేందుకు సర్వేయర్లు చర్యలు వేగవంతం చేశారు. భూ సర్వే ప్రక్రియ శరవేగంగా జరుగుతుండటంతో స్థానిక రైతుల్లో ఉత్కంఠ నెలకొంది

Original source: hmtvlive.com
Read more on Kaizer News