Kaizer News

సర్వే నంబర్‌ 325లో కేసీఆర్‌కు గుంట భూమి లేదు

సర్వే నంబర్‌ 325లో కేసీఆర్‌కు గుంట భూమి లేదు

· State - Telangana · ntnews.com

బీఆర్‌ఎస్‌ నేత వై సతీశ్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (నమస్తే తెలంగాణ): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎర్రవల్లిలోని సర్వే నంబర్‌ 325లో గుంట భూమి కూడా లేదని బీఆర్‌ఎస్‌ నేత, కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ వై సతీశ్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ఇందుకు అధికారిక రికార్డులను ఆధారంగా చూపారు. ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 325కు సంబంధించి 2026 ఫిబ్రవరి 13న స్థానిక ఎంఆర్వో, ఆర్డీవో, అడిషనల్‌ కలెక్టర్‌, కలెక్టర్‌లు సంతకాలు చేసి రూపొందించిన 22ఏ నిషేధిత భూముల జాబితా ప్రకారం అకడ కేసీఆర్‌ పేరిట ఒక గుంట భూమి కూడా లేదని స్పష్టం చేశారు. ఆ సర్వే నంబర్‌లోని మొత్తం భూమి దాదాపు 250 మంది దళితుల పేర్ల మీదనే ఉన్నదని తెలిపారు. ప్రభుత్వ అధికారులంతా క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ఖరారు చేసిన ఈ అధికారిక వివరాలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నిజంగానే తెలియదా లేక రాజకీయ దురుద్దేశంతోనే సభను తప్పుదోవ పట్టించారా అని ఆయన నిలదీశారు. కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారం ఈ పత్రాలతో పూర్తిగా బట్టబయలైందని ఆయన పేరొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News