హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో జింబాబ్వే వెటరన్ బ్యాటర్, మాజీ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ అద్భుత హాఫ్ సెంచరీతో రాణించాడు. ఐదో స్థానంలో మైదానంలోకి దిగిన ఎర్విన్ వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. మొత్తంగా 79 బంతుల్లో 59 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో ఎర్విన్ వన్డే క్రికెట్‌లో ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐసీసీ పూర్తి స్థాయి సభ్యత్వం ఉన్న జట్ల తరఫున వన్డేల్లో హాఫ్ సెంచరీ సాధించిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఎర్విన్ చరిత్ర సృష్టించాడు. 41 సంవత్సరాల 32 రోజుల వయస్సులో ఎర్విన్ ఈ ఫీట్ సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు అఫ్గానిస్తాన్ సీనియర్ ఆల్ రౌండర్ మహమ్మద్ నబీ పేరిట ఉండేది. నబీ 40 ఏళ్ల 286 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా, తాజాగా ఎర్విన్ దానిని అధిగమించాడు. వన్డేల్లో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పెద్ద వయస్కులు వీరే క్రెగ్ ఎర్విన్ (జింబాబ్వే): 41 ఏళ్ల 32 రోజులు (వర్సెస్ ఆస్ట్రేలియా, 2026) మహ్మద్ నబీ (అఫ్గానిస్థాన్): 40 ఏళ్ల 286 రోజులు (వర్సెస్ బంగ్లాదేశ్, 2025) మిస్బా ఉల్ హక్ (పాకిస్థాన్): 40 ఏళ్ల 283 రోజులు (వర్సెస్ దక్షిణాఫ్రికా, 2015) జియోఫ్రీ బాయ్‌కాట్ (ఇంగ్లండ్): 40 ఏళ్ల 226 రోజులు (వర్సెస్ ఆస్ట్రేలియా, 1981) క్లైవ్ లాయిడ్ (వెస్టిండీస్): 40 ఏళ్ల 155 రోజులు (వర్సెస్ శ్రీలంక, 1985) చరిత్రలో తొలిసారి! ఈ మ్యాచ్‌లో ఎర్విన్ రికార్డుతో పాటు మరొక అరుదైన రికార్డు నమోదైంది. జింబాబ్వే తుది జట్టులో క్రెగ్ ఎర్విన్, సికందర్ రజా, బ్రెండన్ టేలర్, గ్రేమ్ క్రీమర్ రూపంలో ఏకంగా నలుగురు 40 ఏళ్లు పైబడిన ఆటగాళ్లు బరిలోకి దిగారు. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఒక జట్టు తరఫున ఒకే మ్యాచ్‌లో నలుగురు 40 ప్లస్ ఏళ్ల ప్లేయర్లు ఆడటం ఇదే తొలిసారి. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. చదవండి: IND vs WI: విండీస్ టీమ్‌లో మరో పూరన్.. ఈ కొత్త 'పూరన్' మామూలోడు కాదు! హాఫ్ శారీలో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫోటోలు) కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు) నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్? గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్