ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వ్యాపారులు కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా వినూత్న నిరసనకు దిగారు. అక్టోబర్ 15 నుంచి రూ.2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వసూలు చేయాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా దుకాణాల వెలుపల “యూపీఐ చెల్లింపులు స్వీకరించబడవు” అని రాసి ఉన్న బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల చివరకు వినియోగదారులపై అదనపు భారం పడుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్న తరుణంలో ఈ ఛార్జీలు […]