రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య లీడ్ రోల్స్‌లో వాచస్పతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ సాంగ్‌ను ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించారు. ఆర్ ధృవన్ కంపోజ్ చేసిన ఈ పాట అందరికీ నచ్చుతుందని రామ్ కార్తీక్ అన్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ఫస్ట్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని, ఈ చిత్రంలో ఎమోషనల్ థ్రిల్లర్‌తో పాటు క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉందని దర్శకుడు వాచస్పతి అన్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగే ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుందని, త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని నిర్మాత పంచుమర్తి నరేష్ అన్నారు. గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత ఇతర పాత్రలు పోషిస్తున్నారు