Kaizer News

యాక్షన్‌‌‌‌‌‌‌‌ను డామినేట్‌‌‌‌‌‌‌‌ చేసే ఎమోషన్ ‘ది

యాక్షన్‌‌‌‌‌‌‌‌ను డామినేట్‌‌‌‌‌‌‌‌ చేసే ఎమోషన్ ‘ది ప్యారడైజ్

· State - Telangana · v6velugu.com

‘ది ప్యారడైజ్’ చిత్రంలోని ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుందని, నాని జడల్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో మాస్, యాక్షన్ ఆడియన్స్‌‌‌‌‌‌‌‌కు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్ ఇస్తుందని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల అన్నాడు. నాని హీరోగా నటించిన ఈ పీరియాడిల్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌ మూవీని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సెప్టెంబర్ 24న పాన్ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌గా సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చెప్పిన విశేషాలు. ‘‘మా అమ్మగారు ఆడపిల్ల పుడితే బాగుంటుందని భావించారు. కానీ పుట్టలేదు. నాకే జడలు, గౌన్‌ వేసి పెంచారు. నా రెండో క్లాస్ వరకు ఆ జడలు ఉండేవి. దీని వెనుక చాలా ఎమోషన్ కూడా ఉంటుంది. ఇక సినిమాలోని రెవల్యూషన్, ఆ పాత్రలను నేను పుట్టి పెరిగిన గోదావరిఖని ప్రాంతం నుంచి స్ఫూర్తి పొందాను. ఆదిలాబాద్, గోదావరిఖని ప్రాంతాల మధ్యలో జరిగిన సంఘటనలు తీసుకున్నా. నేను సికింద్రాబాద్ రైల్వే క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో ఉన్నా. ఆ పక్కన ఉండే బస్తీలో జరిగే కథలాగా డిజైన్ చేశాను. మా ఊర్లో నేను చూసిన సంఘటనలన్నీ మళ్లీ ఇక్కడ నాకు కనెక్ట్ అయ్యాయి. ఇందులో ఉన్న యాక్షన్‌‌‌‌‌‌‌‌ను ఎమోషన్ సీన్స్ డామినేట్ చేస్తాయి. ముఖ్యంగా మదర్ అండ్ సన్ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది. మోహన్ బాబు పాత్ర ఈ కథకు చాలా కీలకం. నాని, మోహన్ బాబు ఫేస్-ఆఫ్ చాలా ఇంటరెస్టింగ్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. సంపూర్ణేష్ బాబు హీరో ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌గా చాలా కొత్తగా పెర్ఫార్మ్ చేశారు. అనిరుధ్ అందించిన మ్యూజిక్, ఆర్ఆర్ కిక్కు వేరే లెవెల్‌‌‌‌‌‌‌‌లో ఉంటుంది. ఇందులో బిట్ సాంగ్స్‌‌‌‌‌‌‌‌తో కలిపి మొత్తం ఆరు పాటలు ఉంటాయి. ఏడో తరగతిలో నేను విన్న ‘ఏష నాగుల’ అనే జానపద గీతాన్ని ఇందులో అద్భుతంగా రీక్రియేట్ చేశాం. చిన్నప్పుడు మనం ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ చూడకుండా నేరుగా థియేటర్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ అయ్యేవాళ్లం. నాకు అలా థియేటర్‌‌‌‌‌‌‌‌లో డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా ప్రేక్షకులను సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేయడమే ఇష్టం. అందుకే ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేయడం లేదు. ఈ సినిమాకి సీక్వెల్ గానీ, ప్రీక్వెల్ గానీ ఏమీ ఉండవు. ‘ప్యారడైజ్’ రిలీజ్ అయ్యాక ఒక మూడు నెలలు మైండ్‌‌‌‌‌‌‌‌కి రెస్ట్ ఇచ్చి ఫ్యామిలీతో గడపాలనుకుంటున్నా. తర్వాత చిరంజీవి గారితో సినిమా వందశాతం ఉంటుంది’’

Original source: v6velugu.com
Read more on Kaizer News