Kaizer News

రోడ్డుపై గుంతలు.. కాంగ్రెస్‌ నేతల శ్రమదానం

రోడ్డుపై గుంతలు.. కాంగ్రెస్‌ నేతల శ్రమదానం

· State - Telangana · prabhanews.com

ఉట్నూర్, ఆంధ్రప్రభ: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం దంతనపెల్లిలో కాంగ్రెస్‌ నాయకులు సోమవారం శ్రమదానం చేపట్టారు. దంతనపెల్లి పెద్దవాగు వద్ద రహదారిపై ఏర్పడిన భారీ గుంతల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు ప్రమాదకరంగా మారడంతో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు డాక్టర్‌ దాసండ్ల ప్రభాకర్‌ ఆధ్వర్యంలో నాయకులు స్వయంగా రంగంలోకి దిగారు. రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఉట్నూర్‌ మండల అధ్యక్షుడు డాక్టర్‌ దాసండ్ల ప్రభాకర్‌, దంతనపెల్లి ఉపసర్పంచ్‌ మహమ్మద్‌ ముబీన్‌, గ్రామ అధ్యక్షుడు షరీఫ్‌, నాయకులు సంతోష్‌రెడ్డి, చిన్నా, మల్లారెడ్డి, చంద్రబాన్‌, సిలవేరి లింగన్న, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News