Shorts Giddalur: మండలంలోని తాళ్లపల్లె గ్రామంలో పోలేరమ్మ తల్లి బోనాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి . ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలందరిపై పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే కి గ్రామ ప్రజలు, భక్తులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు