Kaizer News

Breaking News | ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ..

Breaking News | ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ..

· State - Telangana · prabhanews.com

Breaking News | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నెల్లూరు జిల్లా మమ్మిడివరం మండలం కోమానిపల్లి వద్ద ఆదివారం జాతీయ రహదారి-216పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తీవ్రతకు ఆర్టీసీ బస్సు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News