భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు క్యాంప్ క్లర్క్ కల్యాణ్ క్రికెట్ బెట్టింగ్ కోసం అడ్డదారులు తొక్కినట్లుగా తేలింది. శనివారం రాత్రి పోలీసులకు లొంగిపోయిన కల్యాణ్‌ను విచారించారు. యాప్‌ల ద్వారా అకౌంట్ టు అకౌంట్‌తో క్రికెట్ బెట్టింగ్ లోపాల్గొన్నాడు. ఉద్యోగాల పేరుతో నకిలీ అపాయింట్మెంట్ లెటర్స్ విషయంలో కూడా తీసుకున్న డబ్బులకు బ్యాంక్ అకౌంట్స్ ద్వారానే లావాదేవీలు నిర్వహించాడు. ఇలా రూ.5.30 కోట్ల వరకు లెక్క తేలింది. ఈ డబ్బంతా బెట్టింగుల్లో పోగొట్టుకున్నాడు. ఎమ్మెల్యే గన్మెన్లు, క్యాంప్ ఆఫీస్‌కు వచ్చే పార్టీ లీడర్ల వద్ద కూడా రూ.లక్షల్లో డబ్బులు తీసుకున్నాడు. అలాగే అధిక వడ్డీలకు అప్పులు తీసుకొని, డబ్బంతా బెట్టింగుల్లో పోగొట్టుకున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం